“వరిసు” పై దిల్ రాజు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 24, 2022 7:02 pm IST

గత కొన్ని రోజులు నుంచి తమిళ్ మరియు మన టాలీవుడ్ సినిమా దగ్గర కూడా భారీ చిత్రం “వరిసు” సినిమా ఇష్యూ కాస్త ఆసక్తిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. అయితే తెలుగులో ఈ చిత్రం రిలీజ్ ఎలా ఉంటుంది ఆనాటికి పరిస్థితులు ఏంటి అనే అంశాలు ఆసక్తిగా మారాయి.

అయితే ఈ సినిమా నిర్మాత అలాగే ఏపీలో కీలక డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు లేటెస్ట్ గా ఈ అంశంపై ఓపెన్ అయ్యారు. లవ్ టుడే ఈవెంట్ లో మాట్లాడుతూ వరిసు రిలీజ్ అంశంపై ప్రత్యేకంగా సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి అయితే స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :