మరో కుటుంబ కథా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న దిల్ రాజు !
Published on Jul 17, 2017 3:44 pm IST


ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమ అందుకున్న భారీ విజయాల్లో ‘శతమానంభవతి’ కూడా ఒకటి. దిల్ రాజు నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. దీని కారణం కథలో ఉన్న బలమే. నటీ నటులకన్నా ముందుగా కథను నమ్మే నిర్మాత దిల్ రాజు సినిమా అనౌన్స్ చేసిన రోజునే రాబోయే విజయాన్ని అంచనావేశారు. ఆయన అంచనాకి తగ్గట్టే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆయనకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది.

అందుకే ప్రస్తుతం భారీ కమర్షియల్ సినిమాలు నిర్మిస్తున్న అయన త్వరలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేయనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కోసం ఫిలిం చాంబర్స్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. వచ్చే సంవత్సరం అశ్విని దత్ తో కలిసి నిర్మించనున్న మహేష్ బాబు సినిమా పూర్తవగానే దీన్ని మొదలుపెట్టనున్నారు. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook