హాట్ టాపిక్ గా మారిపోయిన దిల్ రాజు రీసెంట్ కామెంట్స్.!

Published on May 21, 2022 9:00 am IST


మన టాలీవుడ్ సినిమా దగ్గర ఒక పక్క నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ రేట్ ఉన్న వారిలో దిల్ రాజు కూడా ఒకరు. అయితే ఇప్పుడు దిల్ రాజు పలు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చెయ్యడంతో పాటుగా తన సినిమాల రిలీజ్ మరియు షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అలా చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “ఎఫ్ 3”. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను చేసిన రీసెంట్ కామెంట్స్ ఓ రేంజ్ లో చర్చకు దారి తీశాయి.

సినిమాల కలెక్షన్ ల కోసం మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్ గా మాకు వచ్చిన లెక్కలు మేము ఆ సినిమాల నిర్మాతలకు పంపుతాం అని అయితే వాటిని వారు ఎంత అనౌన్స్ చేసుకోవాలి అనేది వారి ఇష్టం అని కామెంట్స్ చేశారు. అంటే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల వసూళ్లు ఫేక్ అవ్వొచ్చని ఓ టాక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇదిలా ఉండగా తాను నిర్మాణం వహించిన ఎఫ్ 3 కి ఎంత బడ్జెట్ అయ్యింది? ఎంత వసూళ్లు వచ్చాయి అనేది రేపు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తానని తెలపడం గమనార్హం.

సంబంధిత సమాచారం :