
సీనియర్ ప్రొడక్షన్ హౌస్ లను పక్కన పెడితే ఈ పదేళ్ళలో తెలుగు ప్రేక్షకుల ఆదరణ అందుకొని, ఆ బ్యానర్ లో సినిమా వస్తోంది అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడచ్చు అనే బ్రాండ్ సంపాదించుకున్న బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ క్రెడిట్ మొత్తం నిర్మాత దిల్ రాజుకే చెందుతుంది అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. తన బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన దిల్ రాజు సెప్టెంబర్ 24న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ని రిలీజ్ చేయనున్నాడు. ఇది కాకుండా సునీల్ కృష్ణాష్టమి కూడా రిలీజ్ కి సిద్దమవుతోంది. వీటితో పాటు త్వరలోనే అనిల్ రావిపూడి – సాయిధరమ్ తేజ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు.
ఇవి కాకుండా స్టార్ హీరోలైన ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజలతో సినిమాలను ప్లాన్ చేస్తూ వాటిని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే దిల్ రాజు తాజాగా మూడు ఆసక్తికర టైటిల్స్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేసాడు. అవే ‘జనగణమన’, ‘సుప్రీమ్ (ఎసి/డిటిఎస్)’, ‘ఎవడో ఒకడు’. ఈ మూడు టైటిల్స్ దేనికవే డిఫరెంట్ గా ఉన్నాయి. మరి ఈ మూడు టైటిల్స్ ఏ హీరో సినిమాకి సెట్ అవుతాయా అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించే విషయం. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఏ హీరోకి ఏ టైటిల్ సెట్ అవుతుందా అనే విషయాన్ని మీరు కింద కామెంట్స్ రూపంలో తెలపండి.