ఈ తమిళ్ బ్లాక్ బస్టర్ ను తెలుగులో రిలీజ్ చేయనున్న దిల్ రాజు

ఈ తమిళ్ బ్లాక్ బస్టర్ ను తెలుగులో రిలీజ్ చేయనున్న దిల్ రాజు

Published on Nov 8, 2022 2:03 PM IST


కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా లవ్ టుడే గత వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో ప్రదీప్ రంగనాథన్ మరియు ఇవానా జంటగా నటించారు. తాజా సమాచారం ఏమిటంటే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022 న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు