శంకర్ అంటే ఇష్టమే.. కానీ సినిమా చేయను – దిల్ రాజు

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన హీరోగా ‘భారతీయుడు-2’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసేప్పుడు చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని కూడా ప్రకటిటించారు. ఆ సమయంలో దిల్ రాజు కూడా వేదికపైనే ఉన్నారు. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకే దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వార్తలు బయలుదేరాయి.

అప్పటికి నుండి ఆయన సినిమా చేస్తారని కొన్ని రోజులు చేయరని కొన్ని రోజులు డిస్కషన్స్ జరిగాయి. ఎట్టకేలకు ఈరోజు పుట్టినరోజు సందర్బంగా నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీటిపై స్పందించిన దిల్ రాజు శంకర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో సినిమా చేయదలని ఎన్నాళ్లగానో తనకుందని, కానీ ‘భారతీయుడు-2’ చేయడంలేదని క్లారిటీ ఇచ్చారు. తన శ్రేయోభిలాషుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా చెప్పారు.