వైరల్ : సంచలనంగా మారిన దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్.!

వైరల్ : సంచలనంగా మారిన దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్.!

Published on Dec 16, 2022 7:03 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ లలో సక్సెస్ రేట్ అధికంగా ఉన్నటువంటి నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. మరి బిజినెస్ తో పాటుగా మంచి సినిమాలు అందించే నిర్మాతగా దిల్ రాజు ఇప్పుడు నిలిచారు. ఇక ఇప్పుడు రోజులు మారుతూ ఉండడంతో తన బ్యానర్ మార్కెట్ ని కూడా విస్తరిస్తున్నారు. అలా ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారిసు అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ విషయం లో లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారి వైరల్ అవుతున్నాయి.

మరి తాను మాట్లాడుతూ తమిళ్ లో మా సినిమా తో పాటుగా మరో స్టార్ హీరో అజిత్ గారి సినిమా కూడా రాబోతుంది. కానీ అజిత్ కన్నా విజయ్ పెద్ద హీరో తమిళ్లో నెంబర్ 1 హీరో కాబట్టి నేను ఇంకో 50 థియేటర్స్ ఎక్కువ ఇవ్వాలని అడుగుతున్నాను అని తెలిపారు. ఇరు హీరోలకి సగం సగం థియేటర్స్ ఇస్తాం అంటున్నారు అదెలా కుదురుతుంది అజిత్ కన్నా విజయ్ పెద్ద హీరో అంటూ దిల్ రాజు చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ అయితే ఇప్పుడు తెలుగు సహా తమిళ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు