ఐటి రైడ్స్‌పై దిల్ రాజు భార్య కామెంట్స్

ఐటి రైడ్స్‌పై దిల్ రాజు భార్య కామెంట్స్

Published on Jan 21, 2025 2:58 PM IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటిపై ఐటి రైడ్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. దీంతో టాలీవుడ్ మొత్తం ఈ రైడ్స్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే, ఈ రైడ్స్‌కి సంబంధించి తాజాగా దిల్ రాజు సతీమణి తేజస్విని కొన్ని కామెంట్స్ చేశారు.

దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితా రెడ్డి నివాసంలో ఈ రైడ్స్ జరిగాయని.. ఇవి సాధారణంగా నిర్వహించే రైడ్స్ అని.. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన రైడ్స్ కావడం.. అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ అడిగారని.. అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానం చెప్పామని.. అమె తెలిపారు.

అయితే ఈ రైట్స్‌పై దిల్ రాజు ఎలాంటి కామెంట్స్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు