టైటిల్ అనౌన్స్ చేసిన దిల్ రాజు !

ఈ నెల 21 న దిల్ రాజు నిర్మించిన ‘ఎంసిఏ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని, సాయి పల్లవిలు జంటగా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ పాటలు ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు నిన్న మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తను నిర్మించబోయే కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసారు. ‘అదే నువ్వు అదే నేను’ టైటిల్ తో తెరకేక్కబోయే ఈ సినిమాను నూతన దర్శకుడు శశి డైరెక్ట్ చెయ్యబోతున్నాడని దిల్ రాజు తెలిపారు. ఈ మూవీ లో హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సినిమాతో పాటు రామ్, త్రినాదరావ్ ల కాంబినేషన్లో ఒక సినిమా నితిన్, సతీష్ వేగేశ్న కలయికలో ‘శ్రీనివాస కళ్యాణం’ అలాగే వంశీ పైడిపల్లి, మహేష్ బాబు ప్రాజెక్ట్ చేయనున్నారు దిల్ రాజు.