రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధురంధర్ 2’ ట్రైలర్ విడుదల పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. హోలీ పండుగ సందర్భంగా రేపు (మార్చి 3న) ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే, ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండించారు. రేపు ట్రైలర్ విడుదల కావడం లేదని ఆయన స్పష్టం చేయడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.
ఈ విషయంపై స్పష్టత కోసం తరణ్ ఆదర్శ్ నేరుగా జియో స్టూడియోస్‌ను సంప్రదించగా, ట్రైలర్ విడుదలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్ లేదని వారు వెల్లడించారు. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రమోషనల్ కంటెంట్ సిద్ధంగా ఉన్నప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో ట్రైలర్ రిలీజ్ పై వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ఈ భారీ యాక్షన్ డ్రామా మార్చి 19, 2026న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
