ప్రముఖ నిర్మాత చేతిలోకి నాని సినిమా !
Published on Oct 28, 2017 5:09 pm IST

‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ నుంచి ‘నిన్ను కోరి’ వ‌ర‌కు వ‌రుస‌గా ఆరు విజ‌యాలు అందుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. ఇప్పుడు నాని మినిమం గ్యారెంటి హీరో అయిపోయాడు, వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి, ప్ర‌స్తుతం ఈ హీరో ‘ఎం.సి.ఎ’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాలు చేస్తున్నారు. ‘ఎం.సి.ఎ’ డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుండ‌గా.. ‘కృష్ణార్జున యుద్ధం’ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

‘ఎం.సి.ఎ’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు, గతంలో ‘ఓమై ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీ రామ్ఈ సినిమాకు దర్శకుడు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత నాని ‘కృష్ణార్జున యుద్ధం’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఆంధ్ర, తెలంగాణా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు చెబుతున్నారు. దిల్ రాజు ప్రమేయంతో సినిమా బయటికి వస్తుండడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.

 
Like us on Facebook