ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో వున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తాజాగా ఆయన ఓ ప్రెస్ మీట్ లో పాలొగొన్నారు. ఈమీట్ లో ఆయన బ్యానర్ నుండి రానున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈఏడాది మా బ్యానేర్ నుండి 4నుండి 5 సినిమాలు విడుదలకానున్నాయి. ఇక మహర్షి విషయానికి వస్తే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 2నుండి జరుగనుంది. మార్చి లో షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 25న విడుదలచేయనున్నాం. అలాగే 96 తెలుగు రీమేక్ కూడా పెద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవుతుంది అందులో ఎలాంటి అనుమానాలు లేవు.
ఇక ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని కూడా నిర్మించనున్నాం. ఈ సీక్వెల్ లో వెంకటేష్ , వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో కూడా జాయిన్ కానున్నాడు. 2021 సంక్రాంతికి ఈచిత్రాన్ని విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నాం అని దిల్ రాజు అన్నారు.
