రామ్ ‘హలోగురు’ కూడా..!

‘ఉన్నదిఒకటే జిందగీ’ చిత్రం తరువాత యువ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘హలోగురు ప్రేమకోసమే’. ‘నేను లోకల్’ ఫెమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే ఈసినిమాలోని కొన్ని సీన్లు నిర్మాత దిల్ రాజు కు నచ్చకపోవడంతో డైరెక్టర్ ను మళ్లీ రీషూట్ చేయమన్నాడట. దాంతోఇప్పుడు చిత్ర టీం ఆపనుల్లో ఉన్నట్లు సమాచారం.

ఇక ఇటీవల ‘లవర్, శ్రీనివాస కళ్యాణం’ చిత్రాల రూపంలో వరుస పరాజయాలు పలకరించడంతో ఈ చిత్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట దిల్ రాజు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో రామ్ కు జోడిగా అనుపమ నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది.

Advertising
Advertising