గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన “ఖిలాడీ” హీరోయిన్..!

Published on Jan 27, 2022 10:00 pm IST

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘ఖిలాడీ’ మూవీ హీరోయిన్ డింపుల్ హయాతీ పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మూడు మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డింపుల్ హయాతీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ ఛాలెంజ్ కొనసాగింపులో భాగంగా హీరో రవితేజ, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, హీరోయిన్ మీనాక్షి చౌదరీ, దర్శకుడు రమేశ్ వర్మలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని డింపుల్ హయాతీ సవాల్ విసిరింది.

సంబంధిత సమాచారం :