డైరెక్ట్ టెలివిజన్ ప్రీమియర్ గా రానా దగ్గుపాటి సినిమా!

Published on Sep 3, 2021 5:52 pm IST

రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అరణ్య. ఈ చిత్రం కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా బాలీవుడ్ లో విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దం గా ఉంది. ఈ విషయము ను రానా దగ్గుపాటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హాతీ మేరా సాతీ అంటూ ఈ నెల 18 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం జీ సినిమా లో విడుదల కాబోతుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కి సంబంధించిన డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను రానా దగ్గుపాటి విడుదల చేశారు.

సంబంధిత సమాచారం :