మా లో కార్డు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుంది – డైరెక్టర్ అజయ్ భూపతి

Published on Oct 7, 2021 7:35 am IST

RX 100 చిత్రం తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మహా సముద్రం చిత్రం కి దర్శకత్వం వహించారు. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుంకర రామ బ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఈ దర్శకుడు సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాంశనీయం గా మారింది. ఈ థ్రిల్లర్ ఎపిసొడ్ లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి, మా లో కార్డు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుంది అని అన్నారు. ఏదేమైనా, ఈ ఎన్నికల తర్వాత 14 వ తేదీన మహా సముద్రం రిలీజ్ ఉంది. అందరూ తప్పకుండా థియేటర్ల లో చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. ఈ చిత్రం లో రావు రమేష్, జగపతి బాబు, గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :