ఆర్జీవీ ని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక – అజయ్ భూపతి

Published on Jan 3, 2022 1:00 am IST


తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు స్పందిస్తున్నారు. సినీ పరిశ్రమ కి పెద్ద దిక్కుగా ఉండటం పట్ల పలువురు తమదైన శైలిలో స్పందించగా, టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మా బాస్, రామ్ గోపాల్ వర్మ ను ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక అంటూ చెప్పుకొచ్చారు. సామీ మీరు రావాలి సామీ, ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక రామ్ గోపాల్ వర్మ ఫోటో ను సైతం జత చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :