“బిగిల్ 2” పై క్రేజీ హింట్ ఇచ్చిన దర్శకుడు.!

Published on May 25, 2022 7:03 am IST


కోలీవుడ్ కి చెందిన యంగ్ అండ్ స్టార్ దర్శకుల్లో అట్లీ కూడా ఒకడు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే వాటిలో ఇళయ దళపతి విజయ్ తో చేసిన సినిమాలే మూడు ఉన్నాయి. మరి వాటిలో భారీ హిట్ “బిగిల్” కూడా ఒకటి. తమిళ్ మరియు మన తెలుగులో భారీ వసూళ్ళని సాధించిన ఈ చిత్రం పై ఇప్పుడు దర్శకుడు క్రేజీ హింట్ ఇవ్వడం ఆసక్తి గా మారింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఒక ట్వీట్ చేస్తూ విజయ్ చేసిన డ్యూయల్ రోల్స్ లో ఒకటైన రాయప్పన్ పాత్రపై కూడా ఒక సెపరేట్ సినిమా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న వదిలారు. మరి దీనికి సమాధానం ఇస్తూ అట్లీ కూడా తన రాజప్ప స్టైల్ లో చేసేస్తే పోయే…

అని రిప్లై ఇచ్చి బిగిల్ పార్ట్ 2 పై సాలిడ్ హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో బిగిల్ రోల్ కన్నా రాయప్పన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఎమోషనల్ గా ఉంటుందో చూసాము. అలాంటిది ఆ రోల్ పై ఒక సెపరేట్ సినిమా అనే సౌండింగ్ ఆసక్తిగా ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :