బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అయిన ఈ మూవీ నిన్న ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించగా రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించారు.
విషయం ఏమిటంటే, ఈ మూవీని నేడు ప్రత్యేకంగా తన ఫ్యామిలీతో కలిసి వీక్షించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, జవాన్ టీమ్ పై అలానే షారుఖ్ ఖాన్, అట్లీ ల ప్రత్యేకంగా పై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందనలు కురిపించారు. కాగా కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ అట్లీ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. మీ నుండి వచ్చిన ఈ ప్రేమపూర్వకమైన మాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి మహేష్ సర్, త్వరలో మిమ్మల్ని కలుస్తాను అంటూ అట్లీ పోస్ట్ చేసిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
These words coming from you has really made my day, sir. Means a lot to us. ❤️ Love you sir, see you soon sirrrr ❤️❤️❤️ https://t.co/utj7SV9YIF
— atlee (@Atlee_dir) September 8, 2023