ఆరెంజ్: ఒక సముద్రాన్ని చూశాను – డైరెక్టర్ భాస్కర్

Published on Mar 26, 2023 8:00 pm IST

సినిమా స్పెషల్ షోలకు వస్తున్న రెస్పాన్స్‌తో ఆరెంజ్ మూవీ డైరక్టర్ భాస్కర్ ఎంతో సంతోషం గా ఉన్నాడు. ఆరెంజ్‌ విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. వీటికి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ సినిమాను ఆస్వాదిస్తున్నారు.

ఈ సినిమా రీ రిలీజ్ తో థియేటర్లు సంగీత కచేరీలుగా మారాయి. ఫ్యాన్స్ ఈ చిత్రం లోని సూపర్‌హిట్ పాటలకు డాన్స్ లు వేస్తూ కేరింతలు కొడుతున్నారు. ఆరెంజ్ దర్శకుడు అయిన భాస్కర్ ఈరోజు హైదరాబాద్లోని దేవి 70ఎంఎం థియేటర్‌లో సినిమాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అతను ఒక సముద్రాన్ని చూశాను అని పేర్కొన్నాడు. అపరిమితమైన ప్రేమకు అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. జెనీలియా కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామాను నాగబాబు నిర్మించారు. హారిస్ జయరాజ్ ఈ సినిమా కి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :