తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న “పవర్”…డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Sep 12, 2023 5:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ పవర్ నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అటు మాస్ మహారాజ రవితేజ కి, ఇటు డైరెక్టర్ బాబీ కు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోవడం పట్ల డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

నా తొలి చిత్రం పవర్ విడుదలై 9 సంవత్సరాలు అయింది. నాకు ఈ అపురూపమైన అవకాశాన్ని ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు. ఎలక్ట్రిఫైయింగ్ ఆల్బమ్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కి ధన్యవాదాలు. నా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :