రవితేజ “రావణాసుర” టీజర్ పై డైరెక్టర్ బాబీ కామెంట్స్!

Published on Mar 6, 2023 12:31 pm IST

మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ లో డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రావణాసుర. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. మాస్ మహారాజా డిఫెరెంట్ షేడ్స్ తో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ను చూసిన డైరెక్టర్ బాబీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రావణాసుర టీజర్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. మాస్ మహారాజా రవితేజ మల్టీ షేడెడ్ క్యారెక్టర్ లో సూపర్ గా చేశారు. బిగ్ స్క్రీన్ పై థ్రిల్ ను ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ కి, చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దివ్యాంశ కౌశిక్ మరియు పూజిత పొన్నాడ లు ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 7, 2023 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :