ఫ్యాన్స్ నుండి FDFS రెస్పాన్స్ ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది – డైరెక్టర్ బాబీ

Published on Mar 4, 2023 1:12 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడం తో డైరెక్టర్ బాబీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50 రోజులు, ఇంకా కొనసాగుతూనే ఉన్న మా మెగా బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య. అభిమానుల నుండి FDFS రెస్పాన్స్ ఇంకా నా చెవుల్లో ప్రతి ధ్వనిస్తుంది అని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారికి, పవర్ ఫుల్ పాత్రలో నటించిన మాస్ మహారాజా రవితేజ గారికి, అద్భుతమైన సంగీతం అందించడం మాత్రమే కాకుండా, సపోర్ట్ గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి థాంక్స్ తెలిపారు. లేడీ లీడ్ రోల్స్ లో నటించిన శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా లతో పాటుగా, సాంకేతిక నిపుణులకి డైరెక్టర్ బాబీ స్పెషల్ థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :