‘వాల్తేరు వీరయ్య’ లో ప్రతి ఫ్రేమ్ ని దర్శకుడు బాబీ అద్భుతంగా డిజైన్ చేసారు – వీరయ్య విజయవిహారం ఈవెంట్ లో రామ్ చరణ్

Published on Jan 29, 2023 12:20 am IST


మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ సక్సెస్ఫుల్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్ తో ప్రస్తుతం దూసుకెళ్తోంది. కాగా నేడు ఈ మూవీ యొక్క విజయ విహారం పేరిట సక్సెస్ ఈవెంట్ ని హన్మకొండలో ఏర్పాటు చేసారు యూనిట్.

కాగా ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, వాల్తేరు వీరయ్య పాత్రలో నాన్న చిరంజీవి గారు అద్భుతంగా నటించారని, గతంలో ఆయన నటించిన ఘరానామొగుడు, ముఠా మేస్త్రి వంటి సినిమాల్లోని పాత్రల మాదిరిగా దర్శకుడు బాబీ ఈమూవీలోని ఆయన పాత్రని అద్భుతంగా రాసుకున్నారని తెలిపారు. అది మాత్రమే కాకుండా సినిమా లోని ప్రతి ఒక్క ఫ్రేమ్ ని ఆయన సూపర్ గా రాసుకున్న విధానం తనకు ఎంతో బాగా నచ్చిందని, మరొక్కసారి దేవిశ్రీ తన పవర్ఫుల్ సాంగ్స్ తో అదరగొట్టారని అన్నారు.

ఇక మాస్ మహారాజా రవితేజ గారు పోషించిన కీలక పాత్ర కూడా బాగా నచ్చిందని, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమా కోసం ఎంతో శ్రమించారని, మొత్తంగా టీమ్ మొత్తం పడ్డ కష్టానికి ఈ రోజున మీరందరూ అద్భుతమైన సక్సెస్ అందించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. తనని వాల్తేరు వీరయ్య విజయవిహారం ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచిన నాన్న కి, నిర్మాత, దర్శకులకి ఆయన ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.

సంబంధిత సమాచారం :