చిరు నెక్స్ట్ లో కీ రోల్ కోసం డైరెక్టర్ బాబీ కసరత్తులు!

Published on Jul 7, 2022 9:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో డైరెక్టర్ బాబీ తో ఒక చిత్రం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్.

ఈ సినిమాలో రవితేజ భాగం కానున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రవితేజ భాగం కావడం లేదని, మేకర్స్ వేరే అవకాశాల కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని ప్రముఖ పేర్లను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు డైరెక్టర్ బాబీ. మరి ఈ ప్రాజెక్ట్ లో రవితేజ జోడీని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి మాస్ పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :