“కల్కి 2” పై ఎటూ తేల్చని దర్శకుడు..

“కల్కి 2” పై ఎటూ తేల్చని దర్శకుడు..

Published on Jun 15, 2024 9:08 AM IST

ప్రస్తుతం దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం ఇది కాగా ట్రైలర్ తో ఒక్కసారిగా సెన్సేషనల్ హైప్ ని ఇది అందుకుంది. ఇక ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో సినిమా ప్రమోషన్స్ కూడా విరివిగా జరుగుతున్నాయి. అలా ఓ ఇంటర్వ్యూ నుంచి నాగ్ అశ్విన్ క్లిప్ వైరల్ గా మారింది.

ఇప్పుడు భారీ చిత్రాలకి వస్తున్నట్టుగా కల్కి కి కూడా సీక్వెల్ ఉంటుందా లేదా అనే దానిపై నాగ్ అశ్విన్ ఏది తేల్చలేదు. పార్ట్ 2 ఉంటుందా అంటే దాని కోసం ఎక్కడా మాట్లాడ్డం లేదు. సీక్వెల్ ఉంటుందా లేదా అనే అంశం తాను రివీల్ చేయడానికి ఇష్టపడడం లేదని దీనితో క్లియర్ అయ్యింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి రెండు కాదు భాగాలు ఉంటాయని కొన్ని రూమర్స్ ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు