“థ్యాంక్ యూ”లో రాశీ ఖన్నా నటనపై విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jul 15, 2022 8:30 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “థ్యాంక్ యూ” కోసం అందరికీ తెలిసిందే. ఒక ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు.

అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు విక్రమ్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఈ సినిమా హీరోయిన్ రాశీ ఖన్నా పెర్ఫామెన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాశీ ఖన్నా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అని ఆమె తన రోల్ అద్భుతంగా చేసింది అని తెలిపారు.

అంతే కాకుండా ఓ సీన్ లో అయితే నాకు కూడా కన్నీళ్లు తెప్పించింది అని అంత సామర్ధ్యం ఉన్న నటి రాశి ఖన్నా అని విక్రమ్ కె కుమార్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ఈ జూలై 22న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :