“భీమ్లా నాయక్” భారీ రెస్పాన్స్ తో తెలుగు సినిమాపై దేవా కట్ట స్పందన.!

Published on Feb 25, 2022 7:44 pm IST

మన టాలీవుడ్ లో స్ట్రాంగ్ కంటెంట్ తో హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీసే అతి తక్కువ మంది దర్శకుల్లో దేవ కట్టా కూడా ఒకరు. తాను చేసిన లాస్ట్ సినిమా “రిపబ్లిక్” చిత్ర అయితే సెన్సేషన్ నే నమోదు చేసింది. ఒక్క బాక్సాఫీస్ లెక్కలు అనేవి పక్కన పెడితే ఈ సినిమా చూసిన వారు మాత్రం ఈ సినిమాని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

మరి ఇలాంటి సినిమాలు చేసే దేవ కట్టా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానాలు నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” రెస్పాన్స్ చూసి మన తెలుగు సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళ నాట ఆడియెన్స్ లో భీమ్లా నాయక్ మాస్ రెస్పాన్స్ చూసి బాహుబలి తర్వాత ఇది మన తెలుగు సినిమా అని..

భాష సరిహద్దులు లేకుండా అందరిని కలుపుకుంటూ వెళుతుంది అని ఇక ఏ ఫోర్స్ కూడా దీనికి ఆపలేదు అని భీమ్లా నాయక్ తో సూపర్ సక్సెస్ అందుకున్న ఉస్తాద్ పవన్ కళ్యాణ్ మరియు రానా లకు అలాగే చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని దేవ కట్టా తెలిపారు. దీనితో పవన్ అభిమానులు సహా రానా అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :