కొత్త టికెటింగ్ పై నిక్కచ్చిగా ‘రిపబ్లిక్’ డైరెక్టర్ వ్యూ.!

Published on Sep 9, 2021 9:00 am IST


ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త రకపు ఆన్లైన్ టికెటింగ్ విధానం తీసుకువస్తారని టాక్ కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపై తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక జీవీ రాలేదు కానీ ఆన్లైన్ టికెట్ విధానంపై ఏపీ ప్రభుత్వం మాత్రం జీవో రిలీజ్ చేసింది.

ఒక కొత్త పోర్టల్ ని ఏపీ ప్రభుత్వం రూపొందిస్తుంది అని దాని ద్వారా ఇక నుంచి సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలని దానిలో సారాంశం. అయితే ఈ కొత్త నిర్ణయం పై సినిమా అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు రేకెత్తాయి. మరి వీటన్నిటినీ దాటి ప్రముఖ దర్శకుడు దేవా కట్ట తన వ్యూ ని నిక్కచ్చిగా సూటిగా సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.

“ఇప్పుడు ఒక ప్రభుత్వం రైల్వే టికెట్స్ ని ప్రభుత్వ ఖజానా కోసం అమ్ముతుంది ఎందుకంటే ఆ రైల్వేస్ ని ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి, మరి అలాగే ఒక ప్రయివేట్ సంస్థ పెట్టిన పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం అలాగే నిధులను అందిస్తుందా? ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆన్లైన్ టికెటింగ్ విధానం ఎలా ఉందంటే ఒక సినిమాని చెయ్యడం గవర్నమెంట్ కాంట్రాక్టులో ఇన్వెస్ట్ చెయ్యడంలా ఉంది.

అంటే ఒక లైన్ లో నించుని అన్ని బిల్స్ క్లియర్ అయ్యే వరకు ఎదురు చూడాలా? ఇలా టికెట్స్ అమ్ముడుపోయి ఒక నిర్మాత పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎదురు చూడాలి? ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే ఎవరైనా దయచేసి నన్ను సరి చెయ్యండి” అని ఈ కొత్త టికెటింగ్ పై స్పందించారు.. దీనితో దేవా వ్యూ తో చాలా మందే ఏకీభవిస్తున్నారు. మరి ప్రస్తుతం దేవా కట్ట మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబోలో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “రిపబ్లిక్” రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :