విజయ్ సినిమా విఎఫ్ఎక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు


ఇళయ దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ తో ఏదో కొత్త ప్రయోగాన్నే చేస్తున్నాడు.

దీనితో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొనగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా మంచి టాక్ నడిచింది. ఈ సినిమాకి ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ లోలా విఎఫ్ఎక్స్ వారు వర్క్ చేస్తుండగా లేటెస్ట్ గా వెంకట్ ప్రభు సాలిడ్ అప్డేట్ అందించాడు. ఈ సినిమా తాలూకా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ షూట్ అంతా పూర్తయ్యిపోయింది అని విజయ్ పై ఇంట్రెస్టింగ్ ఫోటో పెట్టి పోస్ట్ చేసి అప్డేట్ ఇచ్చాడు.

లోలా వారితో వర్క్ చేయడం ఎగ్జైటింగ్ గా ఉందని ఫైనల్ అవుట్ పుట్ కోసం ఎదురు చూస్తున్నాను అని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అభిమానులకి అందించాడు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version