బాలయ్యతో #NBK107 టీమ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..!

Published on Jan 2, 2022 2:14 am IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో #NBK107 టైటిల్‌తో సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, ఇంతలోనే బాలయ్యకు ‘అఖండ’ షూటింగ్‌లో గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం కాస్త ఆలస్యమైంది. అయితే జనవరి 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా దర్శకుడు గోపిచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు బాలయ్యని కలిసి న్యూ ఇయర్ విషెష్ తెలియచేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడని, ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ అయితే, మరొకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని సమాచారం. పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇక థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :