సూపర్ స్టార్ “సర్కారు వారి పాట” పై గోపీచంద్ మలినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 13, 2022 8:07 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ను చూసిన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

సర్కారు వారి పాట చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ ను చూడటం ఫీస్ట్ లా ఉంది అని, మహేష్ టైమింగ్ అన్ మ్యాచబుల్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక కీర్తి సురేష్ తన పాత్ర తో ఆకట్టుకుంది అని, డైరెక్టర్ పరశురామ్ డైలాగ్స్, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు. దర్శకుడు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :