“రాధే శ్యామ్‌” పై హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 14, 2022 9:00 pm IST

రొమాంటిక్ మూవీస్ తీయడంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల విడుదలైన టాలీవుడ్ బిగ్గీ రాధే శ్యామ్‌పై ప్రశంసలు కురిపించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ పీరియాడికల్ డ్రామాలో ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించారు. అందాల రాక్షసి దర్శకుడు ట్విటర్‌ వేదిక గా ఈ చిత్రం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రాధే శ్యామ్ చాలా అరుదైనది. ప్రశంసనీయమైన పని చేశారు డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్. విక్రమాదిత్యగా ప్రభాస్ గారు మరియు ప్రేరణగా పూజా హెగ్డే అద్భుతంగా కనిపించడం ట్రీట్. ఈ ఇతిహాసం ను చూడండి. పెద్ద స్క్రీన్‌ లపై ప్రేమకథ మరియు ఆనందాన్ని అనుభవించండి అంటూ చెప్పుకొచ్చారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జగపతిబాబు, మురళీ శర్మ, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ మరియు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :