లవ్ స్టోరీ చిత్రం పై డైరక్టర్ హను రాఘవపూడి కీలక వ్యాఖ్యలు!

Published on Sep 29, 2021 1:33 pm IST

నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ అయ్యింది అని చెప్పాలి. విడుదల అయిన అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రం పై డైరెక్టర్ హను రాఘవపూడి కీలక వ్యాఖ్యలు చేశారు.

లవ్ స్టోరీ చిత్రం ఒక రకమైన సినిమా, ఇది ప్రస్తుతం అవసరం అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో ప్రతి ఒక్కరి నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యం గా నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటన ను కొనియాడారు. ఇలాంటి లవ్ ను చూడలేదు అని, అంతేకాక ఈ చిత్రం శేఖర్ కమ్ముల నుండి తప్ప మరొకరు నుండి ఆశించలేము అంటూ చెప్పుకొచ్చారు. హను రాఘవపూడి చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :