కమల్ “విక్రమ్” పై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్!

Published on Jun 7, 2022 7:30 pm IST

కమల్ హాసన్ హీరోగా లోకేష్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం కి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సైతం సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ చూశారు. ఈ మేరకు సినిమా పై కీలక వ్యాఖ్యలు చేశారు.

విక్రమ్ సినిమా చూసాను. ఇటీవల కాలంలో వచ్చిన క్లాసిక్ ఎంటర్ టైనర్ లలో విక్రమ్ ఒకటి. కమల్ హాసన్ ఇంటెన్స్ యాక్షన్, డైరెక్టర్ లోకేష్ సినిమాను తెరకెక్కించిన విధానం పై ప్రశంసించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ అనిరుద్ రవి కెరీర్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ కీలక పాత్రల్లో నటించగా, సూర్య స్పెషల్ రోల్ లో నటించాడు. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :