భవదీయుడు భగత్ సింగ్ గురించి అన్ని విషయాలు త్వరలో మీతో షేర్ చేసుకుంటా – డైరక్టర్ హరీష్ శంకర్

Published on Feb 6, 2022 10:46 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్రం తో మాస్ పండుగ ను చూపించారు. మరొకసారి పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ సినిమా ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం ను ప్రకటించి చాలా రోజులు గడుస్తున్నా సినిమా కి సంబందించిన అప్డేట్స్ ఏమి రాకపోవడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భవదీయుడు భగత్ సింగ్ కొత్త చిత్రం గురించి అన్ని విషయాలు త్వరలో వెల్లడి చేస్తామని తాజాగా హరీష్ శంకర్ తెలిపారు. అంతేకాక సినిమా లో టైమింగ్ ఎంత ముఖ్యమో, సినిమా కి కూడా అంతే ముఖ్యం అని అన్నారు.

సంబంధిత సమాచారం :