వరుణ్ తేజ్ తో మరోసారి సినిమా ప్లాన్ చేయనున్న హరీష్ శంకర్?

Published on Jan 19, 2022 2:00 pm IST


వరుణ్ తేజ్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గద్దల కొండ గణేష్. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే వచ్చాయి. వరుణ్ తేజ్ గెటప్ మరియు ఇంటెన్స్ యాక్షన్ తో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ పాత్ర కోసం కషపడిన విధానం ను తెలిపారు. చిత్రం కోసం వరుణ్ ఎంతో కష్టపడ్డారు అని, ఎంతో ఇంటెన్స్ గా నటించాడు అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి అద్భుతమైన పాత్ర ను అధిగమించలేను అంటూ చెప్పుకొచ్చారు హరీష్. వరుణ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్, మరోసారి తనతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :