“వీరమల్లు” సెట్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్!

“వీరమల్లు” సెట్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్!

Published on Dec 9, 2022 3:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం తో పాటుగా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.

తాజాగా వీరమల్లు సెట్స్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చారు. సెట్స్ లో గ్రేట్ టైమ్ గడిపినట్లు తెలిపారు. డైరెక్టర్ క్రిష్ గారికి థాంక్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ ను ఇచ్చేందుకకు సిద్ధం అవుతున్నారు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు