“బ్రో” టైటిల్, పోస్టర్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ రెస్పాన్స్!

Published on May 18, 2023 11:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి BRO (బ్రో) అనే టైటిల్ ను ఖరారు చేసారు మేకర్స్. అంతేకాక ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు, టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ సైతం ఈ టైటిల్, పోస్టర్ ల పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయిన, డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా రెస్పాండ్ అయ్యారు.

బ్రో దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ అంటూ చెప్పుకొచ్చారు. వినోదయ సీతమ్ కి అధికారి రీమేక్ అయిన ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు. జూలై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :