హీరో ధనుష్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

హీరో ధనుష్ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on Sep 25, 2022 6:59 PM IST

ధనుష్ మంచి నటుడు. అయితే, సెట్ లో ధనుష్ ఎలా ఉంటాడు ?, ఇదే విషయం గురించి తాజాగా దర్శకుడు సెల్వ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు సెట్ లో ధనుష్ కి నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదని..సెల్వ రాఘవన్ చెప్పుకొచ్చాడు. ధనుష్ తనకి తమ్ముడైనా, సెట్లో మాత్రం ఇద్దరం ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా మాత్రమే ఉంటామని.. అయితే, ధనుష్ లో మంచి దర్శకుడు కూడా ఉన్నాడని సెల్వ రాఘవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘నేనే వస్తున్నా’ అనే సినిమా కథను ధనుష్ తో కలిసి సెల్వ రాఘవన్ రాశారట. త్వరలో రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ చేసిన రెండు పాత్రలు.. ధనుష్ సినీ కెరీర్ లోనే అతనికి ఛాలెంజింగ్ గా ఉన్నాయని సెల్వ రాఘవన్ చెప్పాడు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ ధనుష్ కోసం మరో వైవిధ్యమైన కథను రాస్తున్నాడట. ఈ కథ నేపథ్యం పూర్తిగా కొత్తగా ఉంటుందని సెల్వ రాఘవన్ చెబుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు