సినీ ప్రేమికులకు ఆచార్య విజువల్ ట్రీట్ కానుంది – కొరటాల శివ

Published on Apr 18, 2022 2:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్ని ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచార్య అభిమానులకు, సినీ ప్రేమికులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్ కానుంది అని అన్నారు.స్వచ్ఛమైన వాణిజ్య విలువలతో కూడిన ప్లాట్ ఇది అని అన్నారు. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ ల కాంబినేషన్ చూడటానికి ఆనందంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :