మహానటి ‘సావిత్రి’ లో మరికొంతమంది ప్రముఖులు !


‘నేను శైలజ’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కీర్తి సురేష్. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతుంది. అలనాటి నటి ‘సావిత్రి’ జీవితనేపథ్యంలో తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో కీర్తి సురేష్ ‘సావిత్రి’ పాత్ర పోషిస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంభందించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.
మహానటి ‘సావిత్రి’ సినిమాలో ఎస్విఅర్ పాత్రని నటుడు మోహన్ బాబు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సినిమాలో కేవిరెడ్డి పాత్ర కీలకం, ఈ పాత్ర కోసం డైరెక్టర్ క్రిష్ ను సంప్రదిస్తే ఆయన ఓకే అనడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు మీడియాతో పంచుకోనున్నారు చిత్ర యూనిట్.