‘తమసోమ జ్యోతిర్గమయ’ ట్రైలర్‌ని చూస్తే ‘వేదం’ సినిమా గుర్తొస్తుంది – డైరెక్ట‌ర్ క్రిష్‌

Published on Oct 19, 2021 10:08 pm IST


ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే త‌దిత‌రులు నటించిన చిత్రం ‘తమసోమ జ్యోతిర్గమయ’. విజయ్ కుమార్ బడుగు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను గుణాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై త‌డ‌క ర‌మేష్ నిర్మించారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ని చూస్తుంటే వేదం సినిమా గుర్తొస్తుందని సృజ‌నాత్మ‌క‌ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి అన్నారు.

అయితే గ్రామీణ దృశ్యాలతో.. చేనేత, చేతి వృత్తులలో ప్రత్యేకంగా యువతలో సామాజిక స్పృహను కల్పించే విధంగా ఈ సినిమాని తెర‌కెక్కించార‌ని, ట్రైలర్‌లో ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుందని ప్ర‌శంసించారు. కాగా ఈ సినిమాకు ప్రశాంత్ బిజె సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :