”డార్లింగ్” కోసం అనుదీప్ ప్ర‌మోషన్స్

”డార్లింగ్” కోసం అనుదీప్ ప్ర‌మోషన్స్

Published on Jul 9, 2024 11:00 AM IST

ప్రియద‌ర్శి, న‌భా న‌టేష్ జంట‌గా న‌టిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ‘డార్లింగ్’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ప్రేక్ష‌కుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను జూలై 19న రిలీజ్ చేస్తుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉంది చిత్ర యూనిట్.

కాగా, ఈ సినిమాను ప్ర‌మోట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు అనుదీప్. ‘జాతిర‌త్నాలు’ సినిమాతో ప్రియ‌ద‌ర్శికి మంచి హిట్ ఇచ్చిన అనుదీప్, ఇప్పుడు ‘డార్లింగ్’ చిత్ర ప్ర‌మోష‌న్స్ చేస్తుండ‌టంతో అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక ఈ ప్ర‌మోష‌న్స్ కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అనుదీప్ మ‌రోసారి త‌న‌దైన టైమింగ్ తో ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తూనే కామెడీ పండిస్తున్నాడు. ఈ ప్ర‌మోష‌న్ కు సంబంధించిన పూర్తి వీడియోను ఇవాళ రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఇక ‘డార్లింగ్’ సినిమాలో అన‌న్య నాగ‌ళ్ల‌, బ్ర‌హ్మానందం, మొయిన్, శివా రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కె.నిరంజ‌న్ రెడ్డి, చైత‌న్య రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు