“ఖైదీ 2” లో కార్తీ పాత్ర ను రివీల్ చేసిన డైరెక్టర్ లోకేష్!

Published on Jun 11, 2022 2:00 am IST

కార్తీ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఖైదీ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. విక్రమ్ చిత్రం తో మరోసారి ఖైదీ 2 మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. కార్తీ పాత్ర ఖైదీ 2 లో ఎలా ఉండనుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఖైదీ 2 పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఖైదీ చిత్రం లో కార్తీ, ఢిల్లీ పాత్రను పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఢిల్లీ జైలులో కబడ్డీ ఆడి, ఎన్నో కప్పులు గెలుచుకున్నాడు అని, ఖైదీ లో ఢిల్లీ తో ఒక బ్యాగ్ ఉంది, అందులో కప్పులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మొదటి భాగం లో రివీల్ చేయలేదు అని, నేపథ్య కథ మరియు కబడ్డీ గురించి ఖైదీ 2 లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. లోకేష్ ప్రస్తుతం విక్రమ్ చిత్రం సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :