శివ కార్తికేయన్ “మావీరాన్” టీజర్ పై లోకేష్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 15, 2022 7:30 pm IST

కోలీవుడ్ టాలెంటెడ హీరో శివ కార్తికేయన్ ఈరోజు తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు శివ కార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ మరియు ఎనౌన్స్‌మెంట్ టీజర్‌ను డిజిటల్‌గా ప్రకటించారు. మావీరన్‌/ మహావీరుడు అనే టైటిల్‌తో విడుదలైన ఈ సినిమా అనౌన్స్ మెంట్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

శివ కార్తికేయన్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ చేయనున్నాడని టీజర్‌తో కన్ఫర్మ్ అయింది. మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. మహావీరుడు రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం టీజర్ పై కమల్ హాసన్ విక్రమ్ మూవీ డైరక్టర్ లోకేష్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. టీజర్ ఫైర్ అని, హీరో శివ కార్తికేయన్ కి, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :