“విక్రమ్” వరల్డ్ లోకి సూర్య..కన్ఫర్మ్ చేసిన లోకేష్.!

Published on May 19, 2022 9:14 am IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్”. తన కెరీర్ లో మరో భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా లెవెల్ సినిమా ఇది. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే ప్రశ్నకి జస్ట్ ఈ సినిమా క్యాస్టింగ్ వరకు చాలని చెప్పాలి.

కమల్ తో పాటుగా మరో ఇద్దరు వెర్సిటైల్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ స్టార్స్ తో దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ చేసిన మ్యాజిక్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో వీరితో పాటుగా తమిళ మరో స్టార్ నటుడు సూర్య కూడా ఉన్నాడని ఒక గట్టి టాక్ ఆ మధ్య వచ్చింది.

మరి దీనిపై ట్రైలర్ లో కూడా కొన్ని షాట్స్ చూసి ఆడియెన్స్ మంచి ఎగ్జైట్ అయ్యారు. అయితే లేటెస్ట్ గా దర్శకుడు లోకేష్ అయితే తమ “విక్రమ్” వరల్డ్ లో సూర్య కూడా ఒక భాగం అయ్యారని క్లారిటీ ఇచ్చి కన్ఫర్మ్ చేసాడు. మరి సినిమాలో అయితే సూర్య పాత్ర ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :