“విక్రమ్” నుండి సూర్య పోస్టర్ ను రిలీజ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు

Published on Jun 1, 2022 11:35 am IST


కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య సైతం ఈ చిత్రం లో ఒక స్పెషల్ రోల్ లో చేస్తున్నారు. సూర్య పాత్ర పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది.

అయితే తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. సూర్య బ్యాక్ సైడ్ నుండి వెనక్కి చూస్తున్న ఫోటో తో పోస్టర్ ఉంది. సూర్య కళ్ళ తో ఉండి, పూర్తిగా లేదు ఫోటో. అయితే ఈ లుక్ సూపర్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రం లో సూర్య నటించడం పట్ల డైరెక్టర్ థాంక్స్ తెలిపారు. అంతేకాక ఈ చిత్రం జూన్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది అని తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :