దీపికాకి మణిరత్నం సపోర్ట్..!

deepika padukone and manira

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ రీసెంట్ గానే ఓ భారీ సినిమా నుంచి పలు ఇబ్బందులు రీత్యా తప్పుకున్న వార్తలు ఏ విధంగా సంచలనం రేపాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ముఖ్యంగా ఇది ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలోనే అని అందరికీ తెలిసిందే. అయితే ఎవరి వెర్షన్ వారికి ఉంటే ఈ కాంట్రవర్సీపై దిగ్గజ దర్శకుడు మణిరత్నం స్పందించడం అనేది ఇపుడు ఆసక్తిగా మారింది.

అయితే తాను దీపికా కోసం స్టాండ్ తీసుకోవడం వైరల్ గా మారింది. ఒక ఆర్టిస్ట్ గా దీపికా కోరుకున్న దానిలో తప్పేమి లేదని మణిరత్నం సెలవిచ్చారు. ఎన్ని గంటలు షూట్ లో పాల్గొంటారు, ఎంత మొత్తం ఛార్జ్ చేస్తారు అనేది ఆమెకి ఉన్న హక్కే కాబట్టి అందులో ఎలాంటి ఇబ్బంది లేదని మణిరత్నం చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తన నుంచి కమల్ హాసన్ తో చేసిన భారీ చిత్రం ‘థగ్ లైఫ్’ ఈ జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version