ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కోడికి.. దర్శకుడు మారుతి ఫైర్

Maruthi

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు, నెటిజన్లకు మధ్యన అప్పుడప్పుడు చిన్న చిన్న క్లాషెస్ జరగడం కామన్ అయిపోయింది. సెలబ్రిటీలు పెట్టే పోస్టులను అపార్థం చేసుకునే కొందరు నెటిజన్లు వాటిని తప్పుగా చిత్రీకరిస్తూ అక్షింతలు వేయించుకుంటుంటారు. తాజాగా ఇలాంటిదే దర్శకుడు మారుతి విషయంలో జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ వన రక్షణ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఆ ఫొటోల్లో పవన్ చాలా ఉల్లాసంగా కనిపించారు. అది చూసిన ఫ్యాన్స్ సంతోషంతో ఆయన సంతోషంగా ఉంటే మనకి ప్రతిరోజూ పండగే అంటూ సాయి తేజ్, మారుతిల కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ ఉపయోగించి ఒక ఫోటో ఎడిట్ చేశారు. దాన్ని చూసిన మారుతి పోస్టర్ చాలా బాగుంది, నాకు నచ్చింది అంటూ ట్వీట్ చేశారు.

దాన్ని చూసిన నెటిజన్ ఒకరు అత్యుత్సాహంతో పవన్ అభిమానుల్ని బాగా వాడుకుంటున్నావ్, మీరు సూపర్ ప్లాన్ వేశారు అంటూ కామెంట్ చేశారు. అది గమనించి చిర్రెత్తుకొచ్చిన మారుతి ఏదైనా నచ్చిన పోస్ట్ పెడితే ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కోడికి అంటూ ఫైర్ అయ్యారు. అది చూసిన నెటిజన్స్, మారుతి ఫాలోవర్స్ బాగా సమాధానం ఇచ్చారు అంటూ మారుతికి సపోర్ట్ చేస్తున్నారు.

Exit mobile version